శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -1
శ్రీ హనూమానంజనీసూనుః - వాయుపుత్రో మహాబలః
కేసరీనందన శ్శ్రీమా - న్విశ్వకర్మార్చిత ధ్వజః 1
ఈశ్వరాంశ స్స్వయంజాతో - పార్వతీ గర్భసంభవః
సుచిరం మాతృగర్భస్థో - గర్భవైష్ణవ సంస్క్రతః 2
బ్రహ్మచారీ జవా జ్జాతః - సర్వ విద్యా విశారదః
మాతృగర్భస్థ నటనో - హరిధ్యాన పరాయణః 3
శ్రోణానక్షత్రజ స్సూర్య - గిళనః కపివల్లభః
వజ్రదేహో మహాబాహు - ర్జగదాశ్చర్య శైశవః 4
కాలేన సహ యుద్ధార్థ - కాలదండ ప్రహారకః
కాలకింకర సంహారీ - కాలాంతక విమర్దనః 5
నఖాయుధ స్సర్వజయో - రణశూరో భుజాయుధః
శైలవిక్షేపకో భూజ - విక్షపే పాదఘట్టనః 6
వాలపాశాయుధో దంష్ట్రాయుధః పవనసాహసః
నిరాయుధజయో యాతుధానజి ద్వారపుంగవః 7
ప్రచేతసరిపు ర్భుత- రక్షఘ్నో అంచిత నిగ్రహాః
ఈశాన సగ్రహః కేశీ - సుతగర్వ వినాశనః 8
అద్రికృ న్నిత్రకృ ద్భోజీ - స్నేహకృ న్మేఘనిర్జితః
పురందరధను శ్ఛేత్తా -మాతలే ర్మరభంజనః 9
బ్రహ్శ్టాస్త్ర స్తంభనో రౌద్ర - బాణ నిగ్రహణేనిలః
ఐరావత బలచ్ఛేదీ -వృత్రారే ర్గర్వభంజనః 10
యోగనిద్రాసక్తమనో - జగత్సంహార కారకః
విష్టో రాగ మనోపాయ - కారణః పునరుద్ధితః 11
From Sri Parasara Samhita