Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్
------------------------------------------------------------------------------
హనుమంతుని త్రికరణశుధ్ధిగా సేవించువారి జన్మ ధన్యమనుటకొక చక్కని ఉదాహరణ తులసీదాస్ జీవితం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వానిని మూలానక్షత్ర జాతకుడు, నష్టజాతకుడని, కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాదికూడా చిన్నతనంలోనే చనిపోవటంతో అతణ్ణి దగ్గరకు తీయటానికే అందరూ వెరచేవారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు భగవదనుగ్రహంతో పెరిగాడు.
ఏ విధమైన కష్టములనున్న వారయినా దీనిని పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులై పీడావిమోచనము పొందవచ్చును. హనుమత్సాహిత్య ప్రచారముచేయు మా శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రం ఆశయము ననుసరించి దీనిని భకకోటి కందజేయ గల్గుచున్నందుకు సంతసించుచున్నాము. ఈ గ్రంధము నాదరించి మా కృషిని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాము. తులసీదాసకృతమగు నీస్తోత్రమును సద్వినియోగ మొనర్చుటద్వారా ఎల్లవారు హనుమత్కృపకు పాత్రులౌదురుగాక!
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry.
Guruji can u provide that pdf file so that we can download and take print of it.
ReplyDelete”వందే ,వానర ,నారసింహ ఖగ రాట్ , ,క్రోడాశ్వ ,వాక్త్రాన్చితం
ReplyDeleteనానాలంకరణం ,త్రి పంచ నయనం ,దేదీప్య మానం రుచా
హస్థాబ్జైహ్ అసి ,ఖేట ,పుస్తక ,సుధా కుంభాం ,కుశాద్రీన్ ,హలం
ఖట్వంగం ,మణి ,భూరుహం, చ దధతం సర్వారి గర్వా పహం ”
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో,దివ్య కాంతి తో, దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం ,డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ), మణులు, ధరించిన వాడు, సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం.