సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Saturday, November 26, 2016

సర్వదేవతా స్తుతిః

సర్వదేవతా స్తుతిఃశ్రీవర,
మఖిలవేదస్వరూప,
మమిత ప్రతాపం
అంజనాగర్భ సంభూతం, అఖిల భువన ప్రఖ్యాతం,
కేసరి ప్రియనందనం, కౌండిన్య వంశోద్భవం,
కబళీకృత బాలభానుం, గంధవహ సూనం,
సుగ్రీవ సచివం, అమిత ప్రభావం,
రామకార్య ధురంధరం, రాక్షస సంహారం,
సాగర లంఘన జంఘూలం, సామగాన లోలం,
దశగ్రీవ దర్పహరం, దారి తాక్షప్రము ఖాసురనికరం,

సీతాశోక వినాశనం,
శ్రీరామ ప్రీతి వర్ధనం,
మకరీ శాపమోచనం,
మర్దిత కాలనేమిం, మైరావణ మర్ధనం, సౌమిత్రి ప్రాణదాతారం,
సకల లోకాధారం, శ్రీ సీతారామయోః పరమసంతోషయోగ కారణం,
శ్రితభక్త మందారం, భవిష్యద్బ్రహ్మ రూపం,భగవత్స్వరూపం,
ఘన వాలరోమ నిర్మితశివలింగం, కరుణాంతరంగం,
ఉదయాస్తాచలార్పిత పాదయుగళం, సురముని వినుత సుచరితం,
శ్రీ సువర్చలా కళత్రం, భక్తప్రతిజ్ఞా నిర్వహణ చాతుర్యం, భుక్తిముక్తి దాయకం,
పురుషవరేణ్యం, ఆదిపురుషం, అతివిజయం, శ్రీమంతం హనుమంత ముపాస్మహే||2 comments: