సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, January 3, 2017

శ్రీ పంచముఖ హనుమద్ధృదయం

శ్రీ పంచముఖ హనుమద్ధృదయం 
శీ పంచవక్త్ర హనుమద్ధృదయస్య ఋషిశ్చైవ శ్రీ రామ 
చంద్రః భగవాన్ - ఛందో అనుష్టుప్ - తథా ప్రోక్తా
మంత్రోక్తా దేవతా చ - ఓం బీజం - రుద్రమూర్తయే 
శక్తిః ప్రోక్తా - స్వాహా కీలకం - ప్రసాదే చ వినియోగః 
హ్రా మిత్యాది షడంగాని - భూ రిత్యాదిభి ర్ధిగ్భంధనం - 5

ధ్యాయే ద్బాలదివాకర ద్యుతి నిభం దేవారి దర్పాపహం 
దేవేంద్ర ప్రముఖ ప్రశస్త యశసం దేదీప్యమానం ఋచా
సుగ్రీవాది సమస్త వానరయుతం సువ్యక్త తత్వప్రియం 
సంరక్తారుణ లోచనం పవనజం పీతాంబరాలకృతం    -  6ఓం నమో వాయుపుత్రాయ - పంచవక్త్రాయ తే నమః
నమోస్తు దీర్ఘ వాలాయ - రాక్షసాంతకరాయ చ  -  7

వజ్రదేహ! నమస్తుభ్యం - శతానన మదాపహ!
సీతా సంతోషకరణ! - నమో రాఘవకింకర  - 8

సృష్టి ప్రవర్తక నమో - మహాస్థిత సమోనమః 
కళా కాష్ట స్వరూపాయ - మాస సంవత్సరాత్మక - 9 

నమస్తే బ్రహ్మరూపాయ -  శివరూపాయ తే నమః 
నమో విష్ణుస్వరూపాయ - సూర్యరూపాయ తే నమః  - 10

నమో వహ్నిస్వరూపాయ - నమో గగనచారిణే  - 11

సర్వ రంభావనచర! - అశోకవన నాశక!
నమో కైలాసనిలయ! - మలయాచల సంశ్రయ - 12

నమో రావణనాశాయ - ఇంద్రజి ద్వధకారిణే 
మహాదేవాత్మక! నమో  - నమో వాయుతనూభవ - 13

నమ స్సుగ్రీవసచివ! - సీతా సంతోషకారణ!
సముద్రోల్లంఘన నమో - సౌమిత్రేః ప్రాణదాయక! -  14

మహావీర నమోస్తుభ్యం - దీర్ఘబాహో! నమో నమః 
దీర్ఘవాల నమస్తుభ్యం - వజ్రదేహ! నమో నమః - 15 

చాయాగ్రహ హర నమో - వర సౌమ్యముఖేక్షణ
సర్వదేవ సుసంసేవ్య  - మునిసంఘ నమస్కృత  - 16

అర్జునధ్వజ సంవాస - కృష్ణార్జున సుపూజిత!
ధర్మార్ధ కామ మోక్షాఖ్య - పురుషార్థ ప్రవర్తక  -  17 

బ్రహ్మాస్త్ర వంద్య భగవన్  - ఆహతాసురనాయక!
భక్త కల్ప మహాభూజ! - భూత భేతాళ నాశక   -  18

దుష్టగ్రహ హరానంత ! వాసుదేవ నమోస్తుతే
శ్రీ రామకార్యే చతుర! పార్వతీగర్భ సంభవ  -  19 

నమః పంపావన చర! ఋష్యమూక కృతాలయ
ధాన్యమాలీ శాపహర! కాలనేమి నిబర్హణ  - 20

సువర్చలా ప్రాణనాథ! రామచంద్ర పరాయణ!
నమో వర్గస్వరూపాయ! వర్ణనీయ గుణోదయ - 21

వరిష్ఠాయ నమస్తుభ్యం - వేదరూప నమో నమః
నమస్తుభ్యం నమస్తుభ్యం - భూయో భూయో నమామ్యహం - 22


No comments:

Post a Comment