సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Saturday, June 1, 2013

ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు – హనుమద్బీర

ఆకునందు రెండు హనుమంతుని చిత్రములు – హనుమద్బీర

 
 

 ప్రతి ఆకునందు సహజముగ హనుమన్మూర్తిద్వయము ఉండెడిచెట్టు ప్రకృతిలో నొకటున్నది. శ్రీహనుమంతుడు ప్రకృతిసిద్దముగనే చిత్రింపబడియుండు ఆకులు గల ఆ చెట్టు హనుమద్బీర. ఇది శ్రీశైలము అడవులలోగలదు. ఇలా ప్రకృతిలోనే హనుమంతుడాచెట్టు ఆకులపై చిత్రింపబడియుండుటకు కారణం “ఎవరైనా భక్తుడు ఆచెట్టు క్రింద కూర్చొని ఆంజనేయస్వామిని గూర్చి తపస్సు చేస్తూ అందు స్వామిని ఆవాహనచేసి యుండవచ్చు” అని సినీ సంగీతవేత్త శ్రీ పి.బి. శ్రీనివాస్ అభిప్రాయము.
ఇది కృత్రిమము కాదనుటకు ప్రమాణము సూర్యరాయాంధ్ర నిఘంటువు నందలి 8వ సంపుటమున 475వ పుటలో “హనుమంతబీర – వి. వృక్ష విశేషము ఒకజాతిచెట్టు అని కలదు”. అందే “సీ. హనుమంతబీర మంకెనగిరి కర్ణిక పెదమల్లెకాండ ముప్పిడియుగోలి” అని హంసవింశతుదాహరణము నీయబడినది.
(Source: ఆంధ్ర వాఙ్మయము – హనుమత్కథ – డా. అన్నదానం చిదంబరశాస్త్రి)
 
 
 
 

No comments:

Post a Comment