సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, April 8, 2011

శ్రీ హనుమత్ స్తోత్రములు

 “Sri Hanuman Stotras – శ్రీ హనుమత్ స్తోత్రములు”



శ్రీరామ
జయ హనుమాన్
శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలెననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేకాలు ఉన్నాయి. ఎక్కువ నియామములు కల్గిన తపస్సు లేక మంత్రానుష్టానము సాధారణ భక్తులకు సాధ్యమైనది కాదు. సద్గురు ననుగ్రహం లభించి మంచి సమయంలో తద్గురూపదేశమంది ఏకాగ్రతతో సాధన చేయాలి. అందు జరిగే లోపాల వలన సాధకులకేగాక గురునకు కూడా సమస్యలు ఏర్పడుచుంటాయి. అంతటి ప్రయాసలు లేక ఎల్లరకు సులభసాధ్యమైన మార్గం స్తోత్ర పఠనం.
స్తుతిప్రియులు కానివారుండరు. పొగిడి పని చక్కపెట్టుకొను రీతి లౌకిక ప్రపంచంలోకూడా ఎక్కువగనే చూచుచుంటాము. దేవతలు స్తోత్రప్రియులు. చక్కగా స్తుతించి వారి యనుగ్రహం పొందగల్గుట ఎల్లరకు అనుకూలమైన మార్గం. ముఖ్యంగా హనుమంతుడు పొగిడిన పెరిగెడి స్వామి. అందుకే పాఠకులు, భక్తులు అగువారికి హనుమదనుగ్రహ సంపాదనకు మంచి సాధనంగా ఈ శ్రీహనుమత్ స్తోత్ర కదంబాన్ని అందిస్తున్నాము. ఆయా స్తోత్రములు ఫలితములు అక్కడనే స్థూలంగా సూచింపబడినాయి.
అన్నిటికి ఏకైక ప్రయోజనం హనుమంతుని దయాదృష్టిని మనపై పడునట్లు చేసికొనటం. సాధన వలన యివి అన్నీ మహామంత్రములవలె సిధ్ది నందజేయ గలవే. ఎన్ని లౌకిక ప్రయోజనములున్ననూ పార లౌకికము ముఖ్యముగ కాంక్షింపదగినది. దానినాసించి జన్మ చరితార్థము గావించుకొనుటకై సాధన నొనర్చుట ద్వారా మా కృషిని సార్థకము చేయగోరుచున్నాము. దీక్షల యందు వీనిని పారాయణార్థము వినియోగించకొనవచ్చును. సాధన లేక మహామంత్రములుకూడా వ్యర్థములగునని, సాధన వలన యిట్టి స్తోత్రములుకూడ సకల ప్రయోజన సాధకములుగా గలవని యధార్థము గ్రహించి వీనిని సద్వినియోగము గావించుకొనగోరుచున్నాము.
ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి


Sri Hanumath Trikala Dhyanam- శ్రీహనుమత్ త్రికాలధ్యానం

Sarva Rakshaka Aanjenya Stotram – సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం

Sri Adishankarakrita Hanumath Strotram – శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం

Sri Hanumannuti Roopa Shlokaashtakam – శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము

Sri Anjaneya Astothara Shata Naama Stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామ స్తోత్రమ్

Sri Hanumadbadabaanala Stotram – శ్రీ హనుమద్బడబానల స్తోత్రం

Sudarshana Samhitokta Vibhishanakrita Hanumat Stotram – సుదర్శన సంహితోక్త విభీషణకృత హనుమత్ స్తోత్రం

Eeswaraprokta SriHanumacchakra Dhyanam – ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం

Neelakrita Hanumat Stotram – నీలకృత హనుమత్ స్తోత్రము

Sri Prasannanjaneya Stotra Pancha Ratnani – శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని

Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం 

Sri Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

Sri Anjaneya Mangalastuthi – శ్రీ ఆంజనేయ మంగళస్తుతి

1 comment:

  1. I wish the sanskrit version of these stotras was available for all Hanuman devotees! You are doing incredible work in spreading the rare gems of Hanuman devotion to people. But I only wish the information was available to all.

    Thanks!
    Regards

    ReplyDelete