సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!
Showing posts with label Dr. Annadanam Hanumath Prasad. Show all posts
Showing posts with label Dr. Annadanam Hanumath Prasad. Show all posts

Saturday, December 4, 2010

Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్ Vedio and Complete Book

Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్



------------------------------------------------------------------------------
హనుమంతుని త్రికరణశుధ్ధిగా సేవించువారి జన్మ ధన్యమనుటకొక చక్కని ఉదాహరణ తులసీదాస్ జీవితం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వానిని మూలానక్షత్ర జాతకుడు, నష్టజాతకుడని, కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాదికూడా చిన్నతనంలోనే చనిపోవటంతో అతణ్ణి దగ్గరకు తీయటానికే అందరూ వెరచేవారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు భగవదనుగ్రహంతో పెరిగాడు.
ఏ విధమైన కష్టములనున్న వారయినా దీనిని పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులై పీడావిమోచనము పొందవచ్చును. హనుమత్సాహిత్య ప్రచారముచేయు మా శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రం ఆశయము ననుసరించి దీనిని భకకోటి కందజేయ గల్గుచున్నందుకు సంతసించుచున్నాము. ఈ గ్రంధము నాదరించి మా కృషిని ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నాము. తులసీదాసకృతమగు నీస్తోత్రమును సద్వినియోగ మొనర్చుటద్వారా ఎల్లవారు హనుమత్కృపకు పాత్రులౌదురుగాక!
------------------------------------------------------------------------------



------------------------------------------------------------------------------





------------------------------------------------------------------------------
http://www.jayahanumanji.com/sri-hanuman-bahuk-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b9%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b9%e0%b1%81%e0%b0%95%e0%b1%8d/

------------------------------------------------------------------------------


------------------------------------------------------------------------------

By Dr.Annadanam Chidambara Sastry.

Sunday, November 21, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-4

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-4





 బ్రహ్మాండపురాణాంతర్గత తీర్ధఖండంలోని ఐదవ అధ్యాయములో అంజనాద్రి విషయము ఇలా చెప్పబడింది--
అంజనాదేవి వ్యుత్పత్తిక్రమము:  నారదమహర్షి భృగుమహర్షితో అంజనాదేవి వృత్తాంతమును ఇలా చెప్పెను-
                                                                      పూర్వము త్రేతాయుగములో కేసరి అను పేరు గల రాక్షసరాజు ఉండెను. అతడు పుత్రులు కావాలనే కోరికతో శంకరుని గురించి తపస్సు చేసెను. నిరాహారుడై, జితేంద్రియుడై పంచక్షరీమంత్రజపముతో శంకరుని సంతోషపెట్టెను. అతని తపస్సునకు సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. రాక్షసుడైన కేసరి ధీరుడైన బుధ్ధిమంతుడైన పుత్రుని కోరును. అప్పుడు శంకరుడు 'బ్రహ్మ నిన్ను పుత్రహీనునిగా చేశాడు. కాబట్టి నీకు పుత్రిక కలుగుతుంది. ఆమెకు అమిత బలవంతుడు,తేజస్వీ అయిన పుత్రుడు కలుగుతాడు. అలా నీ మనుమని ద్వారా నీ కోరిక నెరవేరుతుంది.' అని చెప్తాడు. తనకిష్టమైన వరం పొందినవాడై ఆ రాక్షసరాజు పరమానందపడతాడు.    అనతికాలంలోనే ఆయనకు ఓ ఆడశిశువు కలుగుతుంది. ఆమెకు అంజన అని నామకరణం చేస్తాడు రాజు. ఆమె క్రమేణా వృధ్ధి పొంది కన్య కాగా తన మనోరథసిధ్ధి (అనగా కోరిక నెరవేరు సమయము) కొద్ది కాలములోనే కలుగబోతోందని ఆ రాక్షసరాజు తలచెను.
                                                  ఒకనాడు కేసరి అనే కపిశ్రేష్ఠుడు రాక్షసరాజైన కేసరిని తనకు అంజనాదేవినిచ్చి వివాహం చేయమని అడుగుతాడు.రాక్షసరాజు కేసరి సంతోషించి కపిశ్రేష్టుడైన కేసరికి అంజననిచ్చి వివాహం చేస్తాడు. చాలాకాలం అంజనకు సంతానం కలుగదు. కూతురుకి పుట్టే కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. అంజన చాలా బాధపడుతుంది. పుత్రహీనలైన స్త్రీలకు పారలౌకిక సుఖం ఉండదు కదా! పిత్రు ఋణమునుండి తనకు విముక్తి కలగదేమోనని దుఃఖిస్తుంది.పుత్రుని కోసం బ్రాహ్మణులను పూజించి ఆశీస్సులను పొంది వారుకోరిన దానమిచ్చేది.అనేకవ్రతములనాచరిస్తూ ఉపవాసాలతో జగదీశ్వరుని తృప్తిపరిచింది.                                                      



Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"

http://www.jayahanumanji.com/
                                                                                                                                                                            

Saturday, November 20, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-3

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-3

                   అంజనాదేవి అలా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యాక మహాబలవంతుడైన వాయుదేవుడు అంశతో  ఆమె గర్భవతి అయ్యెను.పది మాసముల తరువాత ఆ అంజనాదేవి పుత్రుని కనెను. మునివరులు ఆ బాలునకు హనుమంతుడని నామకరణము చేసిరి.
                   ఈ కొండ మీదనే అంజన వ్రతమాచరించి పుత్రుని కనెను.    ఆ కారణముగా ఆ పర్వతముంకు అంజనాద్రి అనే పేరు కలిగెనని శతానందుడు జనకమహారాజుకు చెప్పెను.

  అంజనా వ్రతమాస్థాయ-పుత్రం ప్రాప్య గిరీశ్వరే !
   తస్మాదంజనశైలోయం-లోకే విఖ్యాతకీర్తిమాన్ !!


                               In Next post,అంజనాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో బ్రహ్మాండపురాణం లో చెప్పబడ్డవిషయం తెలుసుకుందాము.

Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri" http://www.jayahanumanji.com/

Wednesday, November 17, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-2

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-2

  భవిష్యోత్తరపురాణం లోని హనుమంతుని జన్మస్థలమును గురించిన గాధను తెలుసుకుందాము:
  భవిష్యోత్తరపురాణం లోని వేంకటాచల మాహాత్మ్యం లోని ప్రథమోధ్యాయం లో ఇలా చెప్పబడింది-                జనకమహారాజు శతానందుని 'అంజనాద్రి కి ఆ పేరు ఎలా వచ్చింది?' అని అడిగాడు. అప్పుడు శతానందుడు ఇలా చెప్పాడు-- ఒకనాడు కేసరి భార్య ఐన అంజనాదేవి పుత్రహీనురాలు అగుటచే వ్యాకులత చెంది మతంగమహాముని వద్దకు వెళ్ళింది. 'పుత్రహీనురాలనైన నా గతి ఏమిటి? అని మునీశ్వరుని ప్రశ్నించింది.  అప్పుడా ముని అంజనాదేవితో 'పంపాసరోవరమునకు తూర్పున యాభై యోజనాల దూరం లో నరసింహాశ్రమము ఉన్నది.  దానికి దక్షిన దిక్కున ఉన్న నారాయణాచలమునకు ఉత్తరాన ఉన్న స్వామి తీర్థమునకు క్రోశు దూరంలో ఆకాశగంగ అను పేరు గల తీర్థరాజము కలదు. అక్కడకు వెళ్ళి పన్నెండు సంవత్సరములు తపస్సు చేయుము! ఆ          పుణ్యముచే నీకు గుణవంతుడైన పుత్రుడు కలుగుతాడు.' అనెను.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        
                         మతంగమహాముని మాటలు విన్న అంజనాదేవి నారాయణాద్రికి వెళ్ళి స్వామితీర్థములో స్నానమాచరించి     అశ్వథ్థవృక్షమునకు ప్రదక్షిణలు చేస్తూ వరాహస్వామిని     పూజించెను. ఆకాశగంగాసమీపం లో భర్త ఐన కేసరి యొక్క , మతంగమహామునియొక్క ఆజ్ఞతో ఉపవాసదీక్షతో బాహ్యభోగములను విడిచి శరీరమును కాష్ఠముగా చేసి తపస్సు  చేయుచుండెను.                                                 .                                                                                                                                                                                                                                                                                                                      
.(సశేషం)

Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"


Monday, November 15, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-1

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-1



భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికే అనేక స్థలములలో అవతరిస్తాడు. మోక్షదాయకములైన అయోధ్య మొదలగు పట్టణములు అటువంటివే. అయోధ్య ధర్మ స్వరూపుడైన రాముని జన్మభూమి. కనుక ఆ పరిసర ప్రాంతాలలోని వారంతా మేము ధన్యులమని భావిస్తూ ఉంటారు. కాని శ్రీ హనుమజ్జన్మస్థల సమీపములోని వారు తాము ధన్యులమని తలచరు. కారణం ఏడుకొండలలోని అంజనాద్రియే హనుమంతుని జన్మస్థలమని అక్కడివారికి తెలియకపోవడమే ! కనుక హనుమంతుని జన్మస్థలము అంజనాద్రియే అని తెలియజెప్పడమే ఈ రచన యొక్క లక్ష్యము. ఈ విషయంలో అనేక పురాణములు ఇతరగ్రంథములు ప్రమాణములుగా ఉన్నాయి.(సశేషం)

Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"