హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-2
భవిష్యోత్తరపురాణం లోని హనుమంతుని జన్మస్థలమును గురించిన గాధను తెలుసుకుందాము:
భవిష్యోత్తరపురాణం లోని వేంకటాచల మాహాత్మ్యం లోని ప్రథమోధ్యాయం లో ఇలా చెప్పబడింది- జనకమహారాజు శతానందుని 'అంజనాద్రి కి ఆ పేరు ఎలా వచ్చింది?' అని అడిగాడు. అప్పుడు శతానందుడు ఇలా చెప్పాడు-- ఒకనాడు కేసరి భార్య ఐన అంజనాదేవి పుత్రహీనురాలు అగుటచే వ్యాకులత చెంది మతంగమహాముని వద్దకు వెళ్ళింది. 'పుత్రహీనురాలనైన నా గతి ఏమిటి? అని మునీశ్వరుని ప్రశ్నించింది. అప్పుడా ముని అంజనాదేవితో 'పంపాసరోవరమునకు తూర్పున యాభై యోజనాల దూరం లో నరసింహాశ్రమము ఉన్నది. దానికి దక్షిన దిక్కున ఉన్న నారాయణాచలమునకు ఉత్తరాన ఉన్న స్వామి తీర్థమునకు క్రోశు దూరంలో ఆకాశగంగ అను పేరు గల తీర్థరాజము కలదు. అక్కడకు వెళ్ళి పన్నెండు సంవత్సరములు తపస్సు చేయుము! ఆ పుణ్యముచే నీకు గుణవంతుడైన పుత్రుడు కలుగుతాడు.' అనెను.
మతంగమహాముని మాటలు విన్న అంజనాదేవి నారాయణాద్రికి వెళ్ళి స్వామితీర్థములో స్నానమాచరించి అశ్వథ్థవృక్షమునకు ప్రదక్షిణలు చేస్తూ వరాహస్వామిని పూజించెను. ఆకాశగంగాసమీపం లో భర్త ఐన కేసరి యొక్క , మతంగమహామునియొక్క ఆజ్ఞతో ఉపవాసదీక్షతో బాహ్యభోగములను విడిచి శరీరమును కాష్ఠముగా చేసి తపస్సు చేయుచుండెను. .
.(సశేషం)
Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"
No comments:
Post a Comment