అంజనాదేవి అలా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యాక మహాబలవంతుడైన వాయుదేవుడు అంశతో ఆమె గర్భవతి అయ్యెను.పది మాసముల తరువాత ఆ అంజనాదేవి పుత్రుని కనెను. మునివరులు ఆ బాలునకు హనుమంతుడని నామకరణము చేసిరి.
ఈ కొండ మీదనే అంజన వ్రతమాచరించి పుత్రుని కనెను. ఆ కారణముగా ఆ పర్వతముంకు అంజనాద్రి అనే పేరు కలిగెనని శతానందుడు జనకమహారాజుకు చెప్పెను.
అంజనా వ్రతమాస్థాయ-పుత్రం ప్రాప్య గిరీశ్వరే !
తస్మాదంజనశైలోయం-లోకే విఖ్యాతకీర్తిమాన్ !!
తస్మాదంజనశైలోయం-లోకే విఖ్యాతకీర్తిమాన్ !!
In Next post,అంజనాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో బ్రహ్మాండపురాణం లో చెప్పబడ్డవిషయం తెలుసుకుందాము.
Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri" http://www.jayahanumanji.com/
No comments:
Post a Comment