సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, February 22, 2011

Sri Hanuman Stories (7) – సువర్చలా హనుమంతుల వివాహం

Sri Hanuman Stories (7) – సువర్చలా హనుమంతుల వివాహంమారుతి సకల విద్యాసంపన్నుడు. స్నాతకోత్సవమునకు సిధ్దుడైనాడు. ‘గురువర్యా విద్యాదానం చేసిన మీకు గురుదక్షిణ సమర్పించుకొని సెలవు తీసికొంటాను. కాబట్టి మీ మనసున గల కోరిక తెలియజేయవలసింది’ అని అడిగాడు. సమయమెరిగిన సూర్య భగవాను డిలా అన్నాడు.”ఓ హనుమంతా! నీవు లోక సంరక్షణార్థం సముద్రమధనంలో జన్మించిన హాలాహలాన్ని భరించిన ఈశ్వరరూపుడవు. అగ్ని పుత్రుడవు. నా తేజస్సు విశ్వకర్మచే కొంత వేరుచేయబడినది. దానిని కూడ ఈ లోకం భరింపలేదు. దానిని భరించుటకు నీవే సమర్థుడవు. నానుండి పుట్టిన ఆ వర్చస్సును సువర్చలగా నా కుమార్తెగా నీకు కన్యాదానము చేయ నిశ్చయించాను. హనుమంతా భరించువాడు భర్త కాబట్టి ఆ సువర్చస్సును  భరించువాడవుగా సువర్చలకు భర్త కావలసినది. ఇదియే నాకు గురుదక్షిణ” అన్నాడు. వెంటనే హనుమంతుడు “ఓ లోకబాంధవా! నేను బ్రహ్మచర్య వ్రతమునే ఆజన్మాంతము పాలింప నిశ్చయించుకొన్నవాడను. కాబట్టి ఆ వ్రత పాలనను గురుదేవులుగా మీరు కాదన తగునా?” అన్నాడు. వెంటనే సూర్యభగవానుడు “ఓ పవన తనయా! ఈ సువర్చల అయోనిజ. మహాపతివ్రతకాగలది. ఈమెను చేపట్టుటవలన నీ బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలగనట్లు గురుస్థానంలో ఉన్న నేను వరమిస్తున్నాను. ప్రాజాపత్య బ్రహ్మచారిగా నీవు బ్రహ్మచర్య నిష్టాగరిష్టునిగానే జీవింపగల్గుతావు. లోకకళ్యాణార్థం నీకు కళ్యాణ మేర్పడుటతప్ప నీ బ్రహ్మచర్య పాలనకు భంగంకాదు. నీవు పుట్టుకతోనే యజ్ఞోపవీతం కల్గిఉన్న బాలబ్రహ్మచారివి అట్టి బ్రహ్మచర్యమే నీకు శాశ్వత వ్రతంగా నిలుస్తుంది. భవిష్యద్బ్రహ్మవు కాబట్టి నాటి వాణీ స్థానం ఈ సువర్చల వహింపగల్గుతుంది” అన్నాడు. గురువాక్యాన్ని శిరసావహించాడు హనుమంతుడు. సూర్యుడు హనుమంతునకు సువర్చలను సమర్పించాడు. “జ్యేష్ట శుక్ల దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాంసుతాం సువర్చలానామ్నాం – ప్రాదాత ప్రీత్యా హనూమతే” అని పరాశరులవారిచే ఆసువర్చలా కన్యాదానం జేష్ఠశుధ్ధ దశమినాడు జరిగినట్లు స్పష్టంగా చెప్పబడింది. ఆ రోజు బుధవారమని, ఉత్తరా నక్షత్రమని పరాశర మహర్షి చెప్పారు. ఉభయ పక్షములవారి ఆనందోత్సాహాలతో వివాహం వైభవోపేతంగా జరిగింది.


 Read the rest of this entry »

http://www.jayahanumanji.com/

No comments:

Post a Comment