సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Saturday, January 9, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 6

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 6పురాణపురుష స్సత్వో - తాపత్రయ వినిర్జితః
నిత్యోదిత - శ్శుద్ధబుద్ధో -  కాలాతీతో వరాజితః - 56


పూర్ణో జగన్నిధిర్హంసః - కల్యాణగుణ భాజనః  
దుర్జయః ప్రకృతిస్వామీ -  సర్వాశ్చర్యమోదితః  - 57

యోగీప్రియ స్సర్వసారో - తారక స్తంతువర్థనః
అంతర్యామీ - జగన్నాథః - స్వరూప స్సర్వతస్సమః   - 58

కైవల్యనాథ కూటస్థ - స్సర్వభూత వశంకరః
సంకర్షణో ్‌భయంకరః - కాల స్సత్యసుఖైకభూః  -  59

ఆర్యో నిశ్చల స్సర్వసాక్షీ - నిరుపాధిప్రియో  హరిః
నాహంవాదీ హృషీకేశో - ప్రథమోంతో జగన్మయః  - 60

అనంతశ్రీ ర్విశ్వబీజో - నిశ్చయో సర్వవీర్యజిత్
స్వప్రకాశః సర్వగీతిః - సిద్ధార్థ స్సర్వమోహనః  - 61

అనుల్లంఘ్యో మహామాయో - ప్రద్యుమ్నో దేవనాయకః
ప్రాణేశ్వరో జగద్బంధుః - క్షేత్రజ్ఞః శ్రీగణేశ్వరః  - 62

క్షరో దురాసదో బ్రహ్మ - ప్రణవో విశ్వసూత్రధృక్
సర్వానవంద్యః ప్రస్థేమః  - సర్వధామో మనఃపతిః  - 63

ఆనంద శ్శ్రీధర శ్శ్రీదః -ప్రాణ స్సర్వనియోజకః
అనంతలీలా కర్తజ్ఞో - దుష్ప్రాపః కాలచక్రకృత్  - 64

ఆదిదేవో పరాశక్తః - స్సర్వదేవ స్సదోర్జితః
జగద్ధరో జగజ్జైత్రో - వాజ్మనః జగదార్తిహా  - 65

శశ్వచ్ఛ్రీ  రసురారాతి -ర్ముకుందో మీనకేతనః
విశ్వశంభుపితా మూలప్రకృతి స్సర్వమంగళః   - 66


From Sri Parasara Samhita. 
No comments:

Post a Comment