శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7
సృష్టిస్థిత్యంతకృ చ్చ్రేష్ఠో - వైకుంఠ స్సుజనాశ్రయ
అనుత్తమః పునర్జాతః - రుద్రా ద్యుత్కృష్ట చేతసః - 67
త్రైలోక్యపావన శ్శుద్ధపాదో విశ్వధురంధరః
మహాబ్రహ్మహితా యజ్ఞ - పుమాన్ స్తోత్రార్థ సాధకః - 68
సర్వమోహ స్సదాపృష్ఠ - స్సర్వదేవప్రియో విభుః
యజ్ఞత్రాతా జగత్సేతుః - పుణ్యో దుస్స్వప్ననాశనః - 69
సర్వదుష్టాంతకృత్సాధ్యో - యజ్ఞేశో యజ్ఞభావనః
యజ్ఞభు గ్యజ్ఞఫలద - స్సర్వశ్రేయో ద్విజప్రియః - 70
వనమాలీ సదాపూతః - చతుర్మార్తి స్సదార్చితః
ముంజకేశ స్సర్వహేతుః - వేదసార స్సదాప్రియః - 71
అనిర్దేశ్యవపు స్సర్వదేవమూర్తి శ్చతుర్భుజః
అనంతకీర్తి నిస్సంగ - స్సర్వదేవశిరోమణిః - 72
పరార్థకర్తా భగవాన్ - స్వార్థకృత్తపానిధిః
వేదగుహ్యో సదోదీర్ణో - వృద్ధిక్షయ వివర్జితః - 73
ధర్మసేతు స్సదాశాంతో - విశ్వరేతా వృషాకపిః
ఋషీ భక్తపరాధీనో - పురాణో కులదేవతా - 74
మాయావానరచారిత్రో - పుణ్యశ్రవణకీర్తనః
వుత్సవో ్‌నంతమాహాత్మ్యః - కృపాళు ర్ధర్మజీవనః - 75
సహస్రనామో విజయో - నిత్యతృప్త శ్శుభద్రకః
అసద్బాహ్యో మహోదారో - పావనో గ్ర్యోగ్రవీక్షణః - 76
విశ్వభోక్తా మహావీరః - కిర్తనాద్భుతభోగవాన్
త్రియుగ శ్శూలవిధ్వంసీ - సాధుసార స్సవిక్రమః - 77
From Sri Parasara Samhitha
No comments:
Post a Comment