సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, January 12, 2011

దండకము యొక్క ప్రాధాన్యత



                                 దండకం అనేది స్తుతి ప్రధానమైనది. దీనిలో భగవంతుని గుణగానం చేస్తాము. అంటే "నీవు ఇన్ని ఘనకార్యాలు చేసిన స్వామివి. వాటివల్ల అనేకమంది కష్టాలనుండి గట్టెక్కారు. సుగ్రీవునకు మంత్రివై రామునితో స్నేహం కలిగేలా చేశావు. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించావు. రామునకు సహాయపడి దుష్టుడైన రావణుని చంపావు. అలా నా కష్టాలను కూడా తీర్చు" అని దండకంలోస్తుతిస్తాము.
                  అంతేగాక హనుమంతునకు ఒక శాపం ఉంది. తన గొప్పతనాన్ని తాను మర్చిపోతాడని! అందులోనే శాపవిమోచనం ఏంటంటే ఎవరైనా తన గొప్పతనాన్ని పొగిడితే తిరిగి తన గొప్పతనం గ్రహిస్తాడని! అందుకే హనుమంతుని పొగిడితేనే ఆయనకు తన గొప్పతనం తెలుస్తుది. అందుకే దండకాలన్నిటిలోకి హనుమంతుని దండకమే ప్రసిధ్ధి చెందింది.
                                 ఇక ఛందస్సు విషయానికి వస్తే దండకాలన్నీ 'త'గణం లో ఉంటాయి. అనగా రెండు గురువులు , ఒక లఘువు ఉంటాయి. ఇవే వరుసగా వస్తూ ఉంటాయి.
                                  వానరులు పొగిడారు కాబట్టే హనుమంతుడు సముద్రం దాటగలిగాడు. అప్పటి వరకు మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. తన భక్తులు కష్టాలలో ఉండటం తనకు సంజీవి పర్వతం మోసినదానికన్నా భారంగా అనిపిస్తుందని ఆయనే స్వయంగా చెప్పాడు. అలానే మనం పొగిడితే మన కష్టాలు ఎంతటివైనా తీరుస్తాడు.
                                       
                             written by Dr. A.V.N.G.HANUMATH PRASAD.

No comments:

Post a Comment