హనుమంతుని ద్వాదశ నామాలు - ఫఠన ఫలం
హనుమానంజనా సూనుః - వాయుపుత్రో మహాబలః !
రామేష్టః ఫల్గుణ సఖః - పింగాక్షోsమితవిక్రమః !!
ఉధధిక్రమణశ్చైవ -సీతా శోకవినాశనః !
లక్ష్మణప్రాణదాతా చ - దశగ్రీవస్య దర్పహా !!
షోడశైతాని నామాని - యః పఠేఛృణుయాదపి !
విద్యారంభే వివాహే చ - ప్రవేశే నిర్గమే తథా !!
సంగ్రామే సర్వకార్యేషు - విఘ్నస్తస్య న జాయతే !!
భావము- హనుమంతుడు, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మహాబలవంతుడు, రామునికి ఇష్టమైనవాడు, అర్జునునికి మిత్రుడు, పింగళ వర్ణము వంటి కన్నులు గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు , సముద్రమును దాటినవాడు , సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టిన వాడు ,లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు , రావణుని గర్వమును హరించినవాడు అనే హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభము నందు , వివాహ సమయాన , ప్రయాణ సమయాలలో యుధ్ధ సమయం లో, అన్ని పనుల ఆరంభములోనూ చదివినా , విన్నా సకల విఘ్నాలూ తొలగి కార్యసిధ్ధి జరుగుతుంది.
by Dr. Annadanam Chidambara sastry written in the book SRI HANUMADVISHAYASARVASWAM
No comments:
Post a Comment