దైవము భక్తుని పరీక్షించునని పురాణములు చెప్పుచున్నవి. కానీ భక్తుడే దైవాన్ని పరీక్షిస్తున్నాడు. కొన్ని కోర్కెలపై కొంతసేపు దైవాన్ని ధ్యానిస్తాడు. దైవానుగ్రహము కల్గి కోరిక నెరవేరినా ఆ దైవమున్నట్లే, లేదా అతడు లేడని యూరుకొనడు. దైవమును నిందించి, విమర్శించి లోకమునకు చెప్పజూచును. అట్టి మనుజుని కూడా అనుగ్రహించి సమాధానపరచగల భక్తసులభుడు, దయాళువు హనుమంతుడే. హనుమన్మహిను బ్రహ్మ కూడా వర్ణింపజాలడు. ఆంజనేయుని పూజించిన సర్వదేవతలను పూజించినట్లే. హనుమంతుని తన ఇంట ఎవడు ప్రతినిత్యమూ భక్తితో పూజించునో వాని ఇంట సంపదలు నిలుచును. దీర్ఘాయువు చేకూరును. సర్వత్ర విజయము చేకూరును. అతడే సర్వులకూ ఆదర్శమూర్తి.
http://www.jayahanumanji.com/sri-hanumadvishaya-sarvasvam-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b9%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%af-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5/
By Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/
No comments:
Post a Comment