సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Thursday, October 14, 2010

హనుమంతుడు - అన్నమయ్య కీర్తనలు 2

హనుమంతుడు - అన్నమయ్య కీర్తనలు 2
అవధారు చిత్తగించు హనుమంతుడు వీడెఅవధారు చిత్తగించు హనుమంతుడు వీడె
భువిలోన కలశాపుర హనుమంతుడు

రామ నీ సేవకుడిదె రణరంగధీరుడు
ఆముకొన్నసత్వగల హనుమంతుడు
దీమసాన లంక సాధించి ఉంగరము దెచ్చె
కామితఫలదుడు యీఘనహనుమంతుడూ

జానకీరమణ సప్తజలధులు లంఘించి
ఆనుక సంజీవి దెచ్చె హనుమంతుడు
పూని చుక్కలెల్లా మొలపూసలు(గా(గ పెరిగి
భానుకోటికంతితో( జొప్పెడు హనుమంతుడు

యినవంశ శ్రీవేంకటేశ నీకరుణతోడ
అనుపమజయశాలి హనుమంతుడు
పనిపూని ఇటమీది బ్రహ్మపట్టమునకు నీ-
యనుమతి( గాచుకున్నాడదె హనుమంతుడు


http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/10/blog-post_09.html


2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. By mistake the comment got deleted. We are sorry for that.

    ReplyDelete